ManaEnadu:వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ నవరాత్రుల తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది దసరా (Dussehra) పండుగ. ఆ తర్వాత దీపావళి (Diwali). ఈ రెండు పండుగలు తెలుగు లోగిళ్లలో చాలా చాలా ప్రత్యేకం. అందుకే చదువులు, ఉద్యోగాల పేరిట కన్నవాళ్లను, ఉన్న ఊరును వదిలి పట్నాలకు వెళ్లిన వారంతా ఈ పండుగలకు సొంతూళ్లకు చేరుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్న వారంతా పండుగలకు తమ ఊళ్లకు వెళ్తుంటారు.
24 ప్రత్యేక రైళ్లు
ఈ నేపథ్యంలోనే పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త (Good news) చెప్పింది. దసరా, దీపావళి పండుగ సందర్భంగా 24 ప్రత్యేక రైళ్లు (Special trains ) నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఛట్ పూజకు (Chaat Puja) వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్లు చెప్పారు.
సికింద్రాబాట్ టు తిరుపతి
అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు సికింద్రాబాద్ టు తిరుపతి (Secundrabad-Tirupati) కి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మరోైపు తిరుపతి-సికింద్రాబాద్‌కు అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వివరించారు.
తిరుపతి టు శ్రీకాకుళం
ఇక తిరుపతి – శ్రీకాకుళం (Tirupati Srikakulam) మధ్య అక్టోబరు 6వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రతి ఆదివారం, శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్తుందని చెప్పారు. మరోవైపు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకు ప్రత్యేక రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.