IMA Survey: నైట్ డ్యూటీ అంటేనే వణకిపోతున్నారు.. సర్వేలో కీలక విషయాలు వెల్లడి

Mana Enadu: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ముఖ్యంగా మహిళా లోకం రాత్రి సమయంలోనే కాదు.. పగలుకూడా ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆఫీసులు, పరిశ్రమలకు వెళ్లి వచ్చే సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నైట్ డ్యూటీలు చేయాలంటేనే మహిళలు వణికిపోతున్నారు. తాజాగా ఇదే విషయంపై Indian Medical Association నిర్వహించిన ఓ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నైట్ డ్యూటీల్లో భద్రత(Safety) కరవైందని సర్వే వైద్యులు తేల్చారు. ఇదే విషయాన్ని ప్రతి మూడింట ఒక డాక్టర్(Doctor) తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మహిళలు తమ భద్రత కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లాల్సి పరిస్థితి తలెత్తేలా తయారైందని సర్వేలో పాల్గొన్న వైద్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ముఖ్యంగా వైద్యులు, ముఖ్యంగా మహిళా డాక్టర్లు నైట్​షిఫ్ట్స్‌(Night Shifts)లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించారు. అయితే వారికి భరోసా కల్పించేందుకు శిక్షణతో కూడిన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయడం, వారి సంఖ్యను పెంచడం వంటివి చేయాలని సూచించింది. అలాగే పని ప్రదేశాల్లో CCTVలను ఏర్పాటు చేయడం, వెలుతురు ఉండేలా చూడటం, అలారమ్ సిస్టమ్, లాకర్ సదుపాయం తదితర ఏర్పాట్లు చేస్తే కొంతమేరకైనా నైట్ డ్యూటీలు చేసే మహిళల్లో భద్రతాభావం పెరుగుతుందని సర్వే వైద్యులు పేర్కొన్నారు.

 చిన్న కత్తులు, పెప్పర్ స్ర్పేలు తీసుకెళ్తున్నారట

దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 3,885 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో చాలా మంది మహిళలే పాల్గొన్నారట. వీరిలో 85శాతం మంది 35ఏళ్ల వయస్సులోపు ఉన్నారు. 61శాతం మంది ఇంటర్న్స్​ లేదా పీజీ ట్రైనీలు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద 63శాతం మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 24.1శాతం మంది సేఫ్టీ లేదని అభిప్రాయపడ్డారు. 11.4శాతం మంది భద్రత విషయంపై అత్యంత ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు డ్యూటీ చేసే ఆసుపత్రుల్లో రూములు కూడా సరిగా ఉండటం లేదని, డ్యూటీ గదులకు అటాచ్డ్ బాత్ రూమ్‌లు కూడా లేవని పలువురు వైద్యులు తెలిపారు. మరోకొందరు తాము బయటికెళ్తే చిన్న కత్తి, పెప్పర్ స్ర్పేలను(Self-Defense tools) తమతో పాటు తీసుకెళ్తామని చెప్పారు. మద్యం సేవించిన, డ్రగ్స్​ మత్తులో ఉన్న వారి నుంచి భౌతిక దాడులు ఎదుర్కొంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

Share post:

లేటెస్ట్