ManaEnadu: ఆదాయానికి మించిన ఆస్తులపై వచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మికుంట తహశీల్దార్ రజిని ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు (ACB raids) నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రెయిడ్స్ కొనసాగుతున్నాయి. రజనీ నివాసంతో పాటు హనుమకొండలోని KLN రెడ్డి కాలనీలో ఉన్న ఆమె బంధువుల నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పటి వరకు తహశీల్దార్ రజని ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అనే వివరాలను ఏసీబీ అధికారులు ఇంకా బయటపెట్టలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్న క్రమంలో మరికొన్ని అక్రమ ఆస్తులు వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.