మన ఈనాడు: హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేసులో బీనామీలకు ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈకేసును మరింత లోతుగా విచారించేందుకు అధికారులు పక్కాగా సిద్దం అవుతున్నారు.
శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ కస్టడిలో ఉన్న శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. గడిచిన రెండేళ్లలోనే కోట్ల రూపాయాల విలువైన ఆస్తులు రిజిస్ర్టేషన్లు జరిగినట్లు ఏసీబీ విచారణలో తేలింది. యాదాద్రి జిల్లాలో 57ఎకరాల భూమి కోనుగోలు చేపట్టినట్లు తెలిసింది.