విజయనగరం జిల్లాలో దారుణం.. తల్లిదండ్రులనే కడతేర్చిన కసాయి కొడుకు..!

విజయనగరం జిల్లా బొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. కుటుంబ మనస్పర్థలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Vijayanagarm: కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణమైన ఘటన విజయనగరం జిల్లాలోని బొండపల్లిలో చోటుచేసుకుంది. బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల రాము (42) భార్య జయలక్ష్మి (40)ను మొదటి భార్య కుమారుడు డోల లక్ష్మణరావు వారి ఇంటి ముందే కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.

డోల రాము మొదట తన స్వగ్రామంలోని దేవి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు… పెద్దవాడు పేరు డోల పైడిరాజు. ఇతడు విశాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండవవాడు డోల లక్ష్మణరావు వేరొక ఇంట్లో ఉంటూ కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. తండ్రి రాము విజయనగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తుంటాడు.

అతడి రెండో భార్య జయలక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. రాము, జయలక్ష్మిలకు చంద్రిక అనే ఒక కుమార్తె కూడా ఉంది. ఈమె బండపల్లిలో 8వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో కుమార్తె స్కూల్‌లో ఉంది. స్థానిక పోలీసులు సిఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ కె.లక్ష్మణరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ మనస్పర్థలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Share post:

లేటెస్ట్