Mana Enadu: వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వానలతో APలోని విజయవాడ నగరాన్ని కృష్ణమ్మ ముంచెత్తింది. అటు TELANGANAలోని KMM, MHBD జిల్లాలను వరుణుడు గజగజలాడించాడు. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వరదలు(Floods) ముంచెత్తుతాయోనని వణుకుతున్నారు. ఈ సమయంలో కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం చెప్పారు అధికారులు. VJA పరిసరాల్లో కృష్ణా నది వరదలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. సాయంత్రం వరకు ఇంకా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడ వరద సహాయ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని CM Chandrababu అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం(FOOD) అందడంలేదని ఫిర్యాదు వస్తున్నాయన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం అందాలని ఆదేశించారు.
నిరంతర పర్యవేక్షణ
ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని CM అన్నారు. బాబాయినే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని వ్యాఖ్యానించారు. విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వార్డుల వారీగా మంత్రులు, IAS, IPS అధికారులు పనిచేస్తున్నారన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోలో రూమ్ నుంచి 24 గంటలు 8 మంది IAS అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని CM తెలిపారు. వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. సరిగా పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు సాయం కోసం ఎంత ఖర్చయినా చేస్తామన్నారు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని సూచించారు.
My Dear People,
I have personally seen and heard the immense plight of #VijayawadaFloods victims. We'll brave these floods and overcome them together. I'm personally monitoring the situation in Vijayawada and overseeing rescue and relief operations. With help from the Central… pic.twitter.com/3djHnNCIVj
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2024
అధికారులు సరిగా పనిచేయకపోతే సహించేది లేదు
ఇంకా సీఎం ఏమన్నారంటే.. ‘‘సహాయక చర్యలు మారుమూల ప్రాంతాలకు చేరాలి. అధికారులు సరిగా పని చేయకపోతే సహించేది లేదు. ప్రజలు బాధల్లో ఉన్నారు, ఎక్కడా అలసత్వం వద్దు. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఆపద సమయంలో కుట్రలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి. కానీ చెత్త రాజకీయాలు చేయడం తగదు. వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా?’’ అని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేస్తామన్నారు. వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్దేశిత పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందు కోసం IAS OFFICER మనజీర్ 79067 96105లో సంప్రదించాలని సూచించారు.