Explosion Incident: రియాక్టర్ పేలిన ఘటన.. మృతులు వీరే

Mana Enadu: ఏపీలోని అనకాపల్లి (Anakapalli)జిల్లాలోని ఎసెన్షీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన(Reactor Blast) ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 25 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. రియాక్టర్‌ పేలిన తరువాత ఓ భవనం కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని భావిస్తున్నారు. కంపెనీ మూడో అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకోగా అగ్నిమాపక సిబ్బంది వారిని క్రేన్‌ సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. మొత్తం 12 అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌పేలి కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ కార్మికశాఖ మంత్రి సుభాశ్ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో కలెక్టర్‌, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. భారీగా పొగ వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు.

 మృతులు వీరే..

ఎసెన్షియా కంపెనీ రియాక్టర్ పేలుడులో ఇప్పటివరకు 14 మంది మరణించగా వారిలో 10 మంది వివరాలు గుర్తించారు. మృతుల వివరాలు ఇవే..
1. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం)
2. రామిరెడ్డి(ల్యాబ్ హెడ్)
3. హారిక(కెమిస్ట్)
4. పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్)5. వై.చిన్నారావు(ప్లాంట్ హెల్పర్)
6. మోహన్(ఆపరేటర్)
7. గణేశ్(ఆపరేటర్)
8. హెచ్.ప్రశాంత్
9. ఎం.నారాయణ10. పి.రాజశేఖర్ ఉన్నారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related Posts

City Civil Court: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు(City Civil Court) ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు(Bomb) పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు…

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *