Mana Enadu: భారీ వర్షాలకు AP, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిమిర్యాల, మున్నేరు వాగులు పొంగి పొర్లడంతో Nationa Highwayలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. HYD-VJA జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు Telangana, Ap సరిహద్దు గ్రామమైన రామాపురం వద్ద చిమిర్యాల వాగు పొంగి ప్రవహిస్తుంది. Kodada నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. NTR జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై Munneru వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. Vijayawada వైపు కీసర Toll plaza వద్ద, హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు Keesara టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. ఇదిలా ఉండగా నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో RTC BUS చిక్కుకుంది. బస్సులోని 30 మంది ప్రయాణికులను Rescue సిబ్బంది రక్షించారు.
రహదారులపైకి భారీగా వరద నీరు
మరోవైపు APలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో Srishailam వైపు వెళ్లొద్దని నాగర్ కర్నూల్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే ఆ మార్గంలో ప్రయాణించొద్దని నాగర్ కర్నూల్ SP గైక్వాడ్ సూచించారు. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లమల కొండల మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వస్తోంది. శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం ఆలయం మీదకు వరద నీరు జాలు వారుతుంది. భారీ వర్షాలతో Atmakur-Dornala, డోర్నాల-శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ మార్గాల్లో పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భవనాశి వాగు పొంగడంతో ఆత్మకూరు-కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఆత్మకూరు-దుద్యాల, ఆత్మకూరు-వడ్లరామాపురం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు తెలంగాణలోని HYD, WGL Haigwayపై రఘునాథ్ పల్లి వద్ద భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
అన్ని విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలోని 8 జిల్లాలకు IMD రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, SRD, కామారెడ్డి, MBNR జిల్లాల్లోని పలు ప్రాంతాలకు RED ALERT జారీ చేశారు. మరో 12 జిల్లాలకు ORENG ALERT జారీ చేశారు. AFS, మంచిర్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, WGL, HNK, జనగాం, VKD జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, HYD, మేడ్చల్ -మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు YELLOW ALERT జారీ చేసింది. ఇదిలా ఉండగా.. MHBD జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం (D) కారేపల్లి, గంగారాం తండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా.అశ్విని హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమయ్య గూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. మరోవైపు వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దని సూచించింది.