Pawan On Hydra: పవన్ నోట మళ్లీ ‘హైడ్రా’.. ఏపీలో ఆక్రమణలపై స్పందించిన జనసేనాని

Mana Enadu: తెలంగాణలో హైడ్రా(HYDRA) కొరడా ఝళిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడిదే హాట్ టాపిక్. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు(Celebraties), రాజకీయ నేతలు(Politicians) అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు కూల్చివేత(Demolitions)లకు పని పెడుతోంది. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో సంచలనంగా మారిన హైడ్రాపై తాజాగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోనూ చర్చ జరుగుతోంది. ఏపీలో హైడ్రా లాంటి సంస్థను తీసుకురావాలనే డిమాండ్లు తాజా విజయవాడ వరదల తర్వాత చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy Cm Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ(Kakinada) జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటించిన ఆయన ఏలేరు రిజర్వాయర్(Yeleswaram Reservoir) పరిస్థితిపై అక్కడి కలెక్టర్‌తో మాట్లాడారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మరోసారి హైడ్రా ప్రస్థావన తీశారు. అక్రమ కట్టడాల విషయంలో కొందరు తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చని, నోటీసులు ఇచ్చాక పునరావాసం కల్పించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని జనసేనాని అన్నారు.

 తెలిసీతెలియక చేయొచ్చు.. వారితో మాట్లాడిన తర్వాతే: పవన్

‘‘కొందరు వ్యక్తులు కబ్జాలు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయో అన్నీ తెలియజేశాకే వాళ్లకు నోటీసులు ఇచ్చి, వాళ్లకు పునరావాసం చేసిన తర్వాతే కూల్చివేతల విషయంలో ముందుకెళ్లాలి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం” అని పవన్ కల్యాణ్ అన్నారు. కాగా, విజయవాడ(Vijayawada)లో బుడమేరు వాగును ఆక్రమించి ఇళ్లు కట్టడంతోనే బెడవాడ మునిగిపోయిందని అంటున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు(Businessmen) బుడమేరును ఆక్రమించి వెంచర్లు వేశారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయని మధ్య తరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొని ఇళ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా అవి పెద్ద పెద్ద కాలనీలుగా విస్తరించాయి. ఇప్పుడీ ఆక్రమణలే బెజవాడకు శాపంగా మారాయని వాపోతున్నారు. దీంతో ఇక్కడ హైడ్రా(Hydra) తరహా వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

 తెలంగాణలో విరుచుకుపడుతున్న హైడ్రా

కాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ సర్కార్ (CM Revanth Reddy) హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమార్కులపై విరుచుకుపడుతోంది. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. అపార్ట్ మెంట్లు, ఖరీదైన విల్లాలను సైతం వదలడం లేదు. అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) 25 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అయితే, తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్లు కొనుక్కొన్నామని, వాటికి ట్యాక్సుల కూడా కడుతున్నామని, ఇప్పుడు అవి అక్రమ కట్టడాలు అంటూ కూల్చేయడం కరెక్ట్ కాదని ఆ ఇళ్ల యజమానులు అంటున్నారు. కళ్ల ముందు తమ ఇళ్లను కూలుస్తుండటం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. సామాన్య ప్రజల విషయంలో హైడ్రా తీరుపై కొంత విమర్శలు వస్తున్నాయి. తెలియక తప్పు చేసి ఉంటారని, అలాంటి వారి జోలికి వెళ్లకపోవడమే బెటర్ అనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Share post:

లేటెస్ట్