Mana Enadu:ఏపీలో భారీ వర్షాలు (AP Rains) జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరదలు విలయం సృష్టించాయి. ఇప్పటికీ ఈ నగరం వరద గుప్పిట్లోనే ఉంది. వరదలో చిక్కుకున్న వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ఇక అక్కడే ఉన్న మరికొందరికి బోట్లు, హెలికాప్టర్ల (Helicopters Food Distribution) సాయంతో ఆహారం సరఫరా చేస్తున్నారు.
అయితే బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాలకూ అధికారులు ఆహారం సరఫరా చేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో బాధితులకు డ్రోన్ల (Drones in Flooded Areas) ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. వరద సహాయ చర్యలపై విభాగాల వారీగా అధికారులకు మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్ (Drones Trail Run) నిర్వహించి సఫలమైంది. ఓ మినీ హెలికాప్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మోయగలవు? ఏయే ప్రదేశాల వరకు వెళ్లగలవు? మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లి రాగలవు? తదితర అంశాలను పరిశీలించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, తాగునీరు, మెడిసిన్ వంటివి దీని ద్వారా తీసుకెళ్లొచ్చని అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకొని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌కు మూడు ఫుడ్‌డెలివరీ డ్రోన్ల (Food Delivery Drones)ను వినియోగించగా. మరో ఐదు డ్రోన్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…