మన Enadu:నిజమాబాద్ జిల్లాలోని బోధన్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కార్త ఒకరి హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు.
దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోధన్ లోని ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ ది గాంధారి మండలం తిప్పారి తండా పోలీసులు గుర్తించారు. అలాగే హత్యకు గల కారణాలకు తెలుసుకున్న పోలీసులు నింధితులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.