సర్కారు బడిలో చదివారు..నాలుగేసి కొలువులు సాధించిన అన్నచెల్లళ్లు

మన Enadu: పట్టుదల సాధించాలనే సంకల్పం..లక్ష్యం ముందు విజయం అందుకోవడం చాలా సులభమనే విషయాన్ని నిరూపించారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన అన్నచెల్లళ్లు శ్రీకాంత్​,మహలక్ష్మి.

ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో ఒకే ఇంట్లో ఆరు ఉద్యోగాలు రావడం విశేషం. అన్న నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించగా చెల్లి రెండు కొలువులకు ఎంపికై పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన కోటపర్తి శ్రీనివాసరావు, ఆండాళ్లమ్మ దంపతులకు కుమారుడు కోటపర్తి శ్రీకాంత్‌, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. తమ పిల్లలకు చిన్ననాటి నుంచి ఆంగ్లంపై ఉన్న ఆసక్తి గమనించి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. శ్రీకాంత్‌ ఆంగ్లంలో డిగ్రీ లెక్చరర్‌గా, జూనియర్‌ అధ్యాపకులతోపాటు టీజీటీ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. వీటికితోడు ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో టీజీటీ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ఇక ఆయన సోదరి మహాలక్ష్మి ఆంగ్లంలో జూనియర్‌ లెక్చరర్‌గా, టీజీటీ ఆంగ్ల ఉపాధ్యాయినిగా ఉద్యోగం సంపాదించారు. వీరు ఇరువురి ప్రాథమిక విద్య చొప్పకట్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో సాగింది. శ్రీకాంత్‌ ఖమ్మం సిద్ధారెడ్డి కళాశాలలో ఆంగ్లంలో డిగ్రీ, కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. బీఈడీని వెంకటాపురంలోని సెంయింట్ఆన్స్‌ కళాశాలలో అభ్యసించారు. మహాలక్ష్మి హైదరాబాద్‌ నిజాం కళాశాల, బేగంపేట ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ, బీఈడీ, పీజీ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలోని పేదింటి పిల్లలు ఒకటిమించి ఉద్యోగాలు సాధించడం పట్ల పలువురు అభినందించారు. నేటి యువతకు వారు ఆదర్శంగా పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్