Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్ చేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

Mana Enadu: బ్యాంకులు అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులు(Credit Cards) అందిస్తుంటాయి. దీంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే.. క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువై నెలనెలా బిల్లులు కట్టలేనివారు, ఇతర ఇబ్బందులు పడుతున్నవారు కార్డును క్లోజ్ చేసుకోవాలని అనుకుంటారు. ఇంతకీ క్రెడిట్ కార్డును ఎలా క్లోజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్రెడిట్ కార్డును క్లోజ్ చేయించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి..

☛ మీకు క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు కస్టమర్ కేర్‌ నంబర్‌కు ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేయాలని చెప్పొచ్చు.
☛ క్రెడిట్ కార్డు ఇష్యూయర్‌కు రిక్వెస్ట్ పెడ్తే… వారు తమ పై అధికారులకు రిక్వెస్ట్ పెట్టి.. మీ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ అయ్యేలా చేస్తారు.
☛ క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని ఈ-మెయిల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు క్యాన్సలేషన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నాయి.

 ఆర్‌బీఐ నిబంధనలు తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) ప్రకారం.. క్రెడిట్ కార్డు వినియోగదారుడు తన కార్డును క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు దాన్ని 7 రోజుల్లో అమలు చేయాలి. లేకపోతే 7 రోజుల తర్వాత వినియోగదారునికి ఆ బ్యాంకు(లేదా) కార్డు జారీ చేసిన సంస్థ రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి.
ఇవి గమనించారా?
☛ మీ క్రెడిట్ కార్డులో ఎలాంటి బకాయిలు ఉండకూడదు. అలా బకాయిలు ఉంటే.. మీ క్రెడిట్ కార్డు క్లోజ్ అవ్వదు.
☛ క్రెడిట్ కార్డు క్లోజ్ చేయించుకుంటే.. అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో భవిష్యత్తులో మీరు రుణాలు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
☛ క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్ ప్రొసీజర్‌ను చదువుకోవాలి. పెనాల్టీలు ఏమన్నా పడతాయేమో గమనించాలి.
☛ కార్డు క్లోజ్ చేసుకునే ముందు.. అందులో ఏమైనా రివార్డు పాయింట్లు ఉంటే.. వాటన్నింటినీ వాడుకోవాలి. లేకపోతే.. అవి వృథాగా పోతాయి.
☛ ఆటోమేటిక్ బిల్ పేమెంట్లు, ట్రాన్స్‌ఫర్స్ ఆన్‌లో ఉంటే.. క్యాన్సిల్ చేసుకోవాలి.

Related Posts

AI చెఫ్‌తో ప్రత్యేకమైన రెస్టారెంట్.. ఎక్కడంటే?

దుబాయ్‌(Dubai)లోని బుర్జ్ ఖలీఫాburj khalifa) సమీపంలో సెప్టెంబర్‌(September)లో ఓ విప్లవాత్మక రెస్టారెంట్ ప్రారంభం కానుంది. పేరు వూహూ (WOOHOO). దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ప్రపంచంలోనే మొదటి AI చెఫ్( AI Chef) ఉన్న రెస్టారెంట్ కావడం. ఈ ఏఐ చెఫ్…

Intel layoffs: ఇన్‌టెల్ ఉద్యోగులకు షాక్.. 5500 మందికి లేఆఫ్స్

ప్రపంచ టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌(Microsoft), ఇన్ఫోసిస్‌(Infosys) వంటి దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించగా, తాజాగా చిప్(Chip) తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్‌ (Intel) కూడా అదే దారిలో నడుస్తోంది. ఖర్చుల తగ్గింపు చర్యల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *