ఉప్పల్RGI క్రికెట్ స్టేడియం ప్రధాన రహదారిలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారు ఫుట్ పాత్ మీదున్న స్ట్రీట్ లైట్ పోల్‌ను ఢీ కొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఏఎస్ రావునగర్‌కు(AS RAO NAGAR) చెందిన శ్రవణ్, నీలీష్ అనే ఇద్దరు వ్యక్తులు ఎల్బీనగర్‌లో ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా ఒకసారిగా కళ్ళు మూసుకపోవడంతో నిద్ర మత్తులో స్ట్రీట్ లైట్ పోల్‌ను ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్ అయి ఒకసారిగా మంటలు(Fire Accident) అంటుకొని కారు దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు డోర్ నుంచి దిగడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి కారులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.