Cherlapally | చర్లపల్లి టెర్మినల్ సిద్దం

ManaEnadu:హైదరాబాద్ నగరంలో ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్‌ అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.

ఇప్పటికే మూడు జతల రైళ్లను స్టేషన్లో నిలుపుతుండగా.. మరికొన్ని ఆపడమే కాకుండా.. అక్కడి నుంచే బయలుదేరేలా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య రెండో లైను సిద్ధమవ్వడంతో నగరం మీదుగా వెళ్తున్న రైళ్లను బైపాస్‌ చేయడానికి ఈ స్టేషన్‌తో వీలు చిక్కుతోంది. ఇలాంటి తరుణంలో ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌(Cherlapally railway station)సిద్ధం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రైళ్ల ఆలస్యానికి కళ్లెం వేయవచ్చని దక్షిన రైల్వే అధికారులు భావిస్తున్నారు.

చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. సిద్ధమైన రైల్వే ప్లాట్‌ఫామ్‌లు..గతంలో రెండు ప్లాట్‌ఫామ్‌లు.. మూడు రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 24 బోగీలు పట్టేలా 5 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రాగా.. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు నిర్మిస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతెన రానుండగా.. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా సిద్ధమవుతోంది. 9 ప్లాట్‌ఫామ్‌లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉంటాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ రైళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫామ్‌లు నిర్మిస్తున్నారు. స్టేషన్‌ బయట బస్‌బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.

Share post:

లేటెస్ట్