వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలనుకుంటున్నారా.. ఐతే ఇదే బెస్ట్ ముహూర్తం!

ManaEnadu:శ్రావణమాసం మహిళకు ప్రత్యేకమైన నెల. ఇక మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసం. శ్రావణమాసం అంటే పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటి. అందుకే లక్ష్మీ, పరమేశ్వరుల ఆశీస్సులు పొందేందుకు ఈ మాసంలో మహిళలు ఎక్కువగా నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం అమ్మవారికి మహిళలు నోము నోస్తారు.

మరి ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మీ అమ్మవారి వ్రతం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే అమ్మవారి వ్రతం కోసం మహిళలు ఏర్పాట్లలో బిజీబిజీ అయ్యారు. అయితే ఆ రోజులో ఏ సమయంలో వ్రతం చేసుకోవడం మంచిది.. వ్రతానికి సరైన ముహూర్తం ఏంటి అంటే..

సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుంచి, 8 గంటల 14 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2 గంటల 17 నిమిషాలు. ఈ ముహూర్తం వ్రతం చేసుకోవడానికి అత్యద్భుతం.
వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుంచి, 3 గంటల 8 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2 గంటల 19 నిమిషాలు. ఇది కూడా శుభసమయం.
కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల 22 వరకు ఉంటుంది. వ్యవధి గంట 27 నిమిషాలు. 

జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ మూడు శుభముహూర్తాలు. ఇవే కాకుండా ఆరోజు మొత్తం శుభకరమైనదే కాబట్టి మీ వీలును బట్టి ఎప్పుడు వ్రతం చేసుకున్నా అమ్మవారి దీవెన మీకుంటుందని పండితులు చెబుతున్నారు. 

 

Share post:

లేటెస్ట్