cVIGIL|మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!

By Naresh Chitturi

అందుబాటులో ‘సి విజిల్‌’ యాప్‌

ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. ‘సి విజిల్‌’ యాప్‌ ద్వారా ఈ అవకాశం కల్పించింది. దాని గురించి తెలుసుకుని, నిబంధనలు ఉల్లంఘించే వారి పని పట్టండిలా…

అసలు.. ఏంటిది..?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ‘సి విజిల్‌’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

రిజిస్టర్‌ చేసుకోండిలా..

ముందుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం వారి ‘సి విజిల్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీ చరవాణి నంబరు ద్వారా దానిలో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ‘సి విజిల్‌’ యాప్‌ సిద్ధమైనట్లే. దాని ద్వారా మీరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు.

ఎలాంటివి చేయవచ్చంటే…

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం. ఇలాంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రికార్డ్‌ చేసి అప్‌లోడ్‌ చేయండి.

ఎలా చేయాలంటే…మీ యాప్‌ తెరవగానే తెరపై ‘ఫొటో’, ‘వీడియో’, ‘ఆడియో’ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోటో ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. మీ లొకేషన్‌ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్‌లోడ్‌ చేయండి. ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించాలి. ఇది ఎన్నికల సంఘానికి చేరుతుంది.

5 నిమిషాల్లో రంగంలోకి అధికారులుయాప్‌లో వివరాలు పొందుపరచగానే జిల్లా ఎన్నికల అధికారి 5 నిమిషాల్లో.. దానిని ఫీల్డ్‌ యూనిట్‌కు పంపిస్తారు. వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. విచారించి, 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాల్లో సి విజిల్‌ యాప్‌లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. మీరు చేసిన ఫిర్యాదు స్టేటస్‌ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది.

అడ్డుకట్ట వేయండి..

తాయిలాలు పంచి, అక్రమాలకు పాల్పడి అధికార పీఠం ఎక్కాలనుకునే అరాచక రాజకీయ పార్టీలకు ఈ యాప్‌ ద్వారా చరమ గీతం పాడొచ్చు. ఈ రోజే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన కనిపిస్తే ఫిర్యాదు చేయండి. అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. మీ పిల్లలు, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం.. మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించింన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *