బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..పైగా తక్కువ ధరకే వస్తుంది..ఇంకేందుకు ఆలస్యమంటూ వీడియో కాల్ లో చూసి బంగారం కోనేశారు..లక్ష పెట్టి బంగారు గొలుసు తెస్తే రూ.2లక్షల ఖరీదైన వస్తువు వచ్చింది. ఇదంతా ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చక్కెర్లు కోడుతోంది..
వారం రోజుల క్రితం నలుగురు గుర్తు తెలియన వ్యక్తులు కౌజు పిట్టలు, బాతులు అమ్ముతున్నామని గ్రామాల్లో తిరిగారు. బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే అధికంగా చెప్పడంతో పక్షలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించలేదు. మరికొందరికి తక్కువ ధరకే ఇచ్చారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు బాతులు, పిట్టలు కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి సెల్ఫోన్లు సేకరించారు. రెండు రోజులు తర్వాత ఆ నెంబర్లుకు వీడియా కాల్ చేసి మాకు పోలాల్లో బంగారం దోరికిందని చూపించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతాల్లోని పోలాల్లోకి వెళ్లి మరి రూ.లక్ష చెల్లించి బంగారం తెచ్చుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు స్థానికంగా ఉన్న బంగారం దుకాణానికి వెళ్లగా రూ.2లక్షల ఖరీదు బంగారం ఉంటుందని చెప్పారు. జనం నోట బంగారం పుకార్లు చేసింది.
వారం రోజుల తర్వాత మళ్లీ వీడియా కాల్స్ వచ్చాయి.. ఈసారి ఏకంగా లంకెబిందెలు దోరికాయని చూపించారు. వాటిలో కిలో బరువైన బంగారం ముద్దలు ఉన్నాయని ఆశ కల్పించారు.రూ.55లక్షల విలువ చేసే బంగారాన్ని కేవలం రూ.12లక్షలకే విక్రయిస్తున్నామని చెప్పారు.
అప్పు చేసి బంగారం కోసం అన్నమయ్య జిల్లా పరుగులు పెట్టారు. ఖమ్మం నగరంలోని బంగారు దుకాణాలకు వెళ్లి పరిశీలించగా నకిలీ బంగారం అని తేలింది. మోసపోయామని తెల్చుకుని లబోదిబోమన్నారు. ఇలా ఒక్కరు కాదు..చాలా మంది కేటుగాళ్లు చేతిలో మోసపోయారని సమాచారం. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ నకిలీ బంగారంపై ఆరా తీస్తున్నారని సమాచారం.