ఆటోలో ప్రయాణిస్తోన్న యువతితో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీవ్ర భయాందోళనకు గురైన యువతి రన్నింగ్ ఆటోలో నుండి కిందకు దూకేసింది.
దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. భయంతో ఆటో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.