Mana Enadu:ఆల్ మోస్ట్ భోజన ప్రియులందరికీ ఆల్ టైమ్ టేస్టీ ఫుడ్(Testy Food) బిర్యానీ. ఈ పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బిర్యానీ(Biryani) అంటే.. బిర్యానీనే.. భయ్యా. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ ఇండియా(India)లోనే మోస్ట్ పాపులర్. ఇది చాలా వరకు ఆరోగ్యకరమైనదని చాలా రీసెర్చ్‌లలో తేలింది. అయితే శ్రావణ మాసంలో మాకెందుకీ బిర్యానీ గోల అని అనుకుంటున్నారా? అవునండీ.. ఇప్పుడు ఈ ఫుడ్డే తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటారా.. సాధారణంగా సింగల్ బిర్యానీ మినిమం రూ.160-180 వరకు ఉంటుంది. కొంచెం క్వాలిటీ, క్వాంటిటీ తక్కువున్న చోట్ల అయితే ఆఫర్ల పేరిట రూ.79, రూ.99, రూ.129గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోచే బిర్యానీ రేటెంతో తెలుసా?.. అయితే వార్త మొత్తం చదివేయండి..
ఎగబడ్డ జనం..
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh)లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కొత్తగా ఓ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.2కే చికెన్ బిర్యానీ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇంకేముంది.. జనాలు రెచ్చిపోయారు. గంటల తరబడి క్యూల్లో నిలబడి బిర్యానీ కోసం ఎగబడ్డారు. దాంతో అందరికీ బిర్యానీ అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు.
ఇదండీ రూ.2ల బిర్యానీ స్టోరీ..
అయితే, హోటల్ నిర్వాహకులు 200 బిర్యానీ ప్యాకెట్లు మాత్రమే సిద్ధం చేయగా, అక్కడికి వచ్చిన వాళ్ల సంఖ్య 2వేలకు పైనే ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. బిర్యానీ ప్యాకెట్లు అందనివాళ్లు తీవ్ర నిరాశ చెందారు. బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భారీ సంఖ్యలో జనం రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పోలీసులు రావాల్సి వచ్చింది. స్థానిక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. జనానికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదండీ రూ.2ల బిర్యానీ స్టోరీ..
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…