ManaEnadu:ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయ యువత అక్కడి కాల్పుల్లో, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. బంగారు భవిష్యత్ కోసం వెళ్లి విగత జీవులుగా తిరిగొస్తున్న తమ పిల్లలను చూసి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటికీ విదేశీ ప్రమాదాల్లో ఎంతో మంది భారతీయులు మృతి చెందుతున్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు హైదరాబాద్ యువకులు మరణించారు.
టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో ఘోర జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్ (Hyderabad Youths)కు చెందిన వారు ఉన్నారు. మరో వ్యక్తి తమిళనాడు వాసిగా గుర్తించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్ టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కినట్లు తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతి వేగంగా ఢీకొన్నాయని (Road Accident in Texas) వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి.. మంటల్లో పూర్తిగా కాలిపోయిన శరీరాలు.
మృతుల వివరాలు
ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్పల్లి, హైదరాబాద్)
ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్)
దర్శిని వాసుదేవన్ (తమిళనాడు)
పాలచర్ల లోకేష్ pic.twitter.com/ddsmvpoK1F— Telugu Scribe (@TeluguScribe) September 4, 2024
డల్లాస్‌లో బంధువును కలిసి ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కగా.. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో వారు బయటకు రాలేకపోయినట్లు సమాచారం. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.