Mana Enadu:యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్‌లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
Free Aadhaar Update : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మరోసారి గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. యూఐడీఏఐ ప్రకారం.. యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్‌లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లకు మాత్రమ రూ. 50 రుసుము వర్తిస్తుంది.
సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. ఫ్రీ ఆధార్ అప్‌డేట్ గడువు తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేకసార్లు గడువు తేదీలకు పొడిగించింది. డిసెంబర్ 15, 2023 తర్వాత మార్చి 14కి పొడిగించగా.. ఆ తర్వాత జూన్ 14కి, ఇప్పుడు సెప్టెంబర్ 14కి పొడిగించింది యూఐడీఏఐ.
మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ని ఉపయోగించి (https://myaadhaar.uidai.gov.in/)కి లాగిన్ చేయండి
క్యాప్చా ఎంటర్ చేసి, ‘Login using OTP’పై క్లిక్ చేయండి.
మీ లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో అందుకున్న ఓటీపీ కోడ్‌ని ఎంటర్ చేయండి.
మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.
‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంచుకోండి. నివాసి ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్స్ ఎంచుకుని అవసరమైన ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.
‘Submit’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
అప్‌డేట్ అభ్యర్థన 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…