సెప్టెంబరు 6వ తేదీ OR 7వ తేదీ.. వినాయక చవితి ఎప్పుడు?

ManaEnadu:భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి (Vinayaka Chaviti) అతి పెద్ద పండుగ. ముఖ్యంగా దేశంలోని మహారాష్ట్ర, హైదరాబాద్‌లో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ముంబయిలోని లాల్ బగ్చా మహరాజ్, హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి (Khairtabad Ganesh) చాలా ఫేమస్. ఈ రెండు చోట్ల గణపతిని చూసేందుకు ప్రతి ఏటా గణేశ్ నవరాత్రుల సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. భాద్రపద మాసంలో చతుర్థి తిథి నుంచి మొదలైన అనంత చతుర్దశి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు గణేశ్ చతుర్థి పండుగను జరుపుకుంటాం. నవరాత్రుల తర్వాత పదో రోజును గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించుకుంటాం .

అయితే ఈ ఏడాది గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi 2024) పండుగను ఏరోజు జరుపుకోవాలనే విషయంలో కొన్ని సందేహాలు నెలకొంటున్నాయి. కొందరు సెప్టెంబరు 6వ తేదీన జరుపుకోవాలి అంటుంటే మరికొందరు 7వ తేదీనే సరైనదని చెబుతున్నారు. ఇంతకీ పంచాంగ కర్తలు, పండితులు ఈ పండుగ ఏరోజున జరుపుకోవాలని సూచిస్తున్నారో ఓ సారి తెలుసుకుందామా?

వినాయక చవితి ఎప్పుడంటే?
తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థ తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 7వ తేదీ శనివారం సాయంత్రం 5:35 గంటల వరకు ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ చేసుకోవడం ఆనవాయితీ. అందుకే సెప్టెంబర్ 7వ తేదీనే వినాయక చవితి (ganesh chaturthi Date) జరుపుకోవాలని పంచాంగ కర్తలు చెబుతున్నారు. అలాగే సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజాము 1:03 నుంచి మధ్యాహ్నం 01:34 వరకు గణపతి పూజ (Ganapati Puja) చేసేందుకు శుభ సమయం అని తెలిపారు.

భాద్రపద శుద్ధ చవితి రోజు పరమశివుడు (Lord Shiva) వినాయకునికి గణాధిపత్యం ఒసగిన రోజు. అందుకే ఈ రోజు తాము చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ గణపతి దేవుడికి పూజ చేస్తారు. అందుకే వినాయకుని విఘ్ననాయకుడు అని కూడా పిలుచుకుంటారు అంటారు. ఏ పూజ, వ్రతం, శుభకార్యం చేసినా ముందుగా గణపయ్యను పూజించడం మన సాంప్రదాయం.

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *