పెరుగుదల.. అదే బాటలో వెండి.. ఎందుకంటే..?! Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం బులియన్ మార్కెట్ల జోష్‌నిచ్చింది. దేశీయ మార్కెట్లో గురువారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1193 పెరిగి రూ.66,943 పలికింది.
Gold Rates | వచ్చే జూన్ లో 25 బేసిక్ పాయింట్లు కీలక వడ్డీరేట్లు తగ్గి్స్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. ఫలితంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో (ఎంసీఎక్స్) తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,193 పెరిగింది. ఈ ఏడాది మూడు దఫాలు వడ్డీరేట్లు తగ్గించేందుకు సిద్ధమని జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు.
పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర సుమారు 1.8 శాతం పెరిగి రూ.66,943వద్ద స్థిర పడింది. మరోవైపు ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.3,010 (నాలుగు శాతం) పెరిగి రూ.78,323 వద్ద నిలిచింది. మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో రూ.930 పుంజుకుని 76,243 వద్ద ముగిసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరాల్లో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1090 పెరిగి 67,420, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పుంజుకుని రూ.61,800 పలికింది. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1090 పెరిగి రూ.67,570, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం రూ.1000 పెరిగి 61,950 వద్ద ముగిసింది.
”వైఫ్’ను ఎంతసేపు చూస్తారు..? సండే కూడా ఆఫీసుకు రండి’
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ…