GST Council Meet: వీటిపై జీఎస్టీ భారీగా తగ్గింపు.. కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

Mana Enadu: మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Medical Insurance) పై GST రేటు తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై మంత్రులతో ఓ కమిటీ వేశామని, అది అక్టోబర్-నవంబర్ వరకు రిపోర్ట్ ఇస్తుందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆరోగ్య బీమా(medical insurance)పై 18% జీఎస్టీ ఉంది. దాన్ని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్(GST Council) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పన్ను తగ్గింపుపై కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా సమాచారం. తదపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

 క్యాన్సర్ మందులపై భారీగా తగ్గింపు

అలాగే లైఫ్, హెల్త్, రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం, డేటా, విశ్లేషణలతో కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్(Fitment) కమిటీ సోమవారం ఒక నివేదికను సమర్పించింది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం నేడు జరిగింది. పలు వస్తువులపై జీఎస్టీ రేట్లు(GST rates) తగ్గించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్యాన్సర్ మందుల(cancer drugs)పై జీఎస్టీని 12% నుంచి 5 శాతానికి తగ్గించామని, దీని వల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. నమ్కీన్‌(Namkeens)పై GSTని 18% నుంచి 12 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు.

 కోట్లాది పాలసీదారులకు ప్రయోజనం

నెలవారీ జీఎస్టీ వసూళ్లు(GST Collections) పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నందున చాలా రాష్ట్రాలు రేట్ల తగ్గింపునకు సుముఖంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీఎస్టీ రేట్లను తగ్గిస్తే ప్రీమియం తగ్గుతుంది.. కాబట్టి కోట్లాది మంది పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు 2023-24లో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు రూ.8,262.94 కోట్లు వసూలు చేయగా, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ద్వారా రూ.1,484.36 కోట్లు వసూలయ్యాయి. ఆరోగ్య, జీవిత బీమా(health and life insurance) ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు కూడా డిమాండ్ చేశారు. పార్లమెంటులో జరిగిన చర్చల్లో బీమా ప్రీమియంలపై పన్ను విధించే అంశం ప్రస్తావనకు వచ్చింది. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) కూడా ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. దీనిపై నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, వసూలైన GSTలో 75% రాష్ట్రాలకు వెళ్తుందని, జీఎస్టీ కౌన్సిల్(GST Council)లో ఈ ప్రతిపాదనను తీసుకురావాలని ప్రతిపక్ష సభ్యులు తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కోరాలని చెప్పారు.

 

Share post:

లేటెస్ట్