Mosquitoes Bite: దోమలకూ ఈ టేస్ట్ కావాలట.. అందుకే వారివెంట పడతాయ్!

Mana Enadu: దోమ కాటు వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వల్ల తలెత్తే సమస్యలు అనేకం. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతుంటాం. అయితే కొందరిని దోమలు పదే పదే కుడుతుంటాయి. వారు ఎంతమందిలో ఉన్నా సరే మళ్లీ వారినే చుట్టుముడతాయి. అయితే దీనిని చాలా మంది అంతగా పట్టించుకోరు. చాలా తేలికగా తీసుకుంటారు. కానీ పరిశోధకులు మాత్రం రీజన్ అదికాదంటున్నారు. దోమల లెక్కలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. సరే పదండి.. దోమలకు కొందరు మాత్రమే ఎందుకు నచ్చుతారో.. వారి రక్తమే ఎందకు టేస్టీగా ఉంటుందో.. తెలుసుకుందాం..

సాధారణంగా తమకు దోమలు ఎక్కువగా కుడుతుంటాయని మద్యం తాగినవారు చెబుతుంటారు. దీనికి గల కారణాన్ని జపాన్‌లోని టొయామా యూనివర్శిటీ బయోడిఫెన్స్ మెడిసిన్ విభాగం తాజాగా గుర్తించింది. ఈ అధ్యయనం ప్రకారం బీర్లు తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలిందట. అలాంటి వారి వాసనను దోమలు 50 మీటర్ల దూరం నుంచే పసిగడుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. బీర్లు తాగడం వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు చెమట, వారు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ (CO2) మొదలైనవి దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయని వెల్లడైంది. అందుకు అలాంటి వారిని దోమలు ఎక్కువగా ఇష్టపడి పదేపదే వారిని చుంబిస్తాయట.

ఈ బ్లడ్ గ్రూప్‌ల వారంటే దోమలకు చాలా ఇష్టం

ఇదిలా ఉంటే దోమలు కుట్టడానికి ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. అవి కుట్టడానికి కూడా వాటికి కావాల్సిన నిర్దిష్ట వాసన ఉండాలట. సాధారణంగా మనలో చాలా రకాల బ్లడ్ గ్రూపులు ఉన్నవారు ఉంటారు. అయితే వీరందరినీ దోమలు కట్టవు. O, A బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడతాయని జపాన్ పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు చాలా ఇష్టమట. వివిధ రకాల బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వారు ఒక చోట కూర్చున్నా సరే ఈ గ్రూప్‌ల వారినే ఎక్కువగా దోమలు కుడతాయని నిర్ధారించారు. అంతే కాదండోయ్ B బ్లడ్ గ్రూపు ఉన్నవారిని దోమలు చాలా తక్కువగా కుడతాయని తేల్చారు. ఇదండీ దోమలు కుట్టడం వెనుక ఉన్న కథ..

https://www.instagram.com/p/C-3FuxnCXQ1/?igsh=a3VnaHdjY3cyaG5l

Share post:

లేటెస్ట్