Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో 24 గంటలూ ఇదే పరిస్థితి: IMD

Mana Enadu: తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. వాయుగుండం తీరం దాటడంతోనే వానలు జోరందుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో AP, తెలంగాణలోని పలు జిల్లాలకు RED అలర్ట్, మరికొన్ని జిల్లాలకు YELLOW అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు భారీవర్షాలుకు రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోగా.. అంతే స్థాయిలో దారి మళ్లించారు రైల్వే అధికారులు. దీంతో అత్యవసరమైతే బయటికి రావాలని రెండు రాష్ట్రాల అధికారులు సూచిస్తున్నారు. అటు సముద్రం, నదులు, చెరువుల్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లోనూ పరువులు మృత్యువాత పడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

APలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, NTR, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు RED ALERT ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే వాగులు, వంకలు తెగి ప్రవహిస్తున్నందున.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని IMD సూచించింది. భారీ వర్షాలు, వరదలపై CM చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాగాన్ని సీఎం ఆదేశించారు. బుడమేరు వరదే ముంపునకు కారణమని CM దృష్టికి తెచ్చారు మంత్రి నారాయణ. వరదలపై ఇరిగేషన్‌ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడాలని సీఎం ఆయనకు సూచించారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను DRONES ద్వారా అంచనా వేయాలన్నీరు చంద్రబాబు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలన్నారు. నష్టాన్ని అంచనావేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని CM సూచించారు.

భారీ వర్షాలపై CM REVANTH REDDY అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులతో CM రేవంత్‌ TELE CONFERANCE నిర్వహించారు. CS, DGP సహా ఉన్నతాధికారులందరూ.. అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని CMOకు పంపాలని.. వరద ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరించిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటూ CM రేవంత్ రెడ్డి సూచించారు.

 

Share post:

లేటెస్ట్