Viral: నడిరోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్న హిజ్రాలు..

సూర్యపేట జిల్లాలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. సూర్యాపేట, తొర్రూర్ కు చెందిన రెండు గ్రూపులు నడి రోడ్డుపై బట్టలిప్పి కొట్టుకున్నారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రావడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ అవుతోంది.

Suryapet: నడిరోడ్డుపై హిజ్రాలు మరోసారి వీరంగం సృష్టించారు. రెండు గ్రూపుల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త పెద్దదవడంతో దాడి చేసుకునేంతవరకూ వెళ్లింది. మాట మాట పెరగడంతో విచక్షణ కొల్పోయిన హిజ్రాలు దారుణంగా కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే బట్టలిప్పి మరి రోడ్లపై హంగామా చేశారు. హిజ్రాల ఫైటింగ్ వీడియో వైరల్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో హిజ్రాలు రెండు గ్రూపులుగా విడిపోయి విచక్షణా రహితంగా దాడులు చేసుకున్నట్లు తెలిపారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రావడమే ఇందుకు కారణమని, చిన్నగా మొదలైన వివాదం రెండు హిజ్రాల గ్రూపుల మధ్య దాడులవరకూ వెళ్లిందని చెప్పారు.

సూర్యాపేట బ్యాచ్.. తొర్రూర్ గ్రూపులకు చెందిన 20 మంది పైగా అందరూ చూస్తుండగానే రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి హిజ్రాలను వారించడంతో వివాదం సద్ధుమణిగిందని, బాధ్యులను స్టేషన్ కు పిలిచి విచారించినట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మందలించి వదిలేసినట్లు సమాచారం.

Related Posts

కోల్​కతా ట్రైనీ డాక్టర్​ కేసు.. డెడ్ బాడీపై మహిళ డీఎన్ఏ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ పై (Kolkata Doctor Murder Case) హత్యచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి (Sanjay Roy) న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.  అయితే విచారణలో భాగంగా…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు సోమవారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *