Mana Enadu: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనుంది.
ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం (మండలి) నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై మండలిలో చర్చించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటామన్న రాహుల్ మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. రాహుల్‌కు మేనిఫెస్టోపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కోరారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత భారత ఎంపీ కేశవ రావు రాజ్యసభకు రాజీనామాచేయడాన్ని స్వాగ తిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…