ManaEnadu: చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి మరీ చదువుతుంటారు. అయితే ఇదే సమయంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈనేపథ్యంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈసారీ భారీస్థాయిలో కొలువులు రిలీజ్ చేసింది. అప్లికేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది.
పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్నటువంటి GDS విభాగంలో మొత్తం 44,228 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఏపీ 1,355, తెలంగాణలో 981 ఖాళీలున్నాయి. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ ద్వారా ఆగస్టు 5వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
* అర్హత: 10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
* వయసు: 18-40 ఏళ్లు. SC,STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
*జీతం: నెలకు BPM పోస్టులకు రూ.12000-రూ. 29,380, ABPM/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10వేల నుంచి రూ. 24,470లు ఉంటుంది.
* ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. ఖాళీలు, రిజర్వేషన్లు, అభ్యర్థులు ఇచ్చిన అప్షన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్/ పోస్టు/ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది.
* దరఖాస్తు ఫీజు: SC,ST దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి ఫీజు లేదు. మిగలిన వారు రూ.100 ఆన్‌లైన్లో చెల్లించాలి.
* పోస్టుల వివరాలు: బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM),డాక్ సేవక్.
* ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్లో దరఖాస్తు సమర్పణకు చివరి తేది 05-08-2024. అప్లికేషన్ సవరణలకు 06.08.2024-08.08.2024 వరకూ అవకాశం ఉంది.