బ్రిటిష్‌ సింగర్‌ జాస్మిన్​తో హార్దిక్ పాండ్య డేటింగ్‌?

ManaEnadu:టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య గురించి చాలా రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. ఐపీఎల్​ సమయంలో నుంచి పాండ్యా సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారాడు. మొదట ఐపీఎల్​లో ముంబయి జట్టుకు కెప్టెన్ కావడం.. ఆ తర్వాత ఆ సీజన్​లో ఆ టీమ్ అంతగా ప్రదర్శన చేయకపోవడం.. టీ20 సమీపిస్తున్న సమయంలో భార్య నటాషాతో విడాకుల రూమర్స్.. ఆ తర్వాత టీ20లో ఇండియాకు కప్పు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం.. టీ20 తర్వాత నటాషాతో విడాకులు.. ఆ తర్వాత అంబానీ పెళ్లిలో బాలీవుడ్ భామ అనన్య పాండేతో డ్యాన్సు చేయడం.. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ మీడియా కోడై కూయడం.. ఇలా దాదాపుగా ఆరేడు నెలల నుంచి హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారాడు.

ఇక సెర్బియా నటి, నటాషా స్టాంకోవిచ్​తో గతనెల వివాహ బంధానికి హార్దిక్ పాండ్యా ముగింపు పలికాడు. అప్పటి నుంచి హార్దిక్​పై నెట్టింట చర్చ ఇంకా పెరిగింది. ఆ తర్వాత అనన్యా పాండేతో రిలేషన్​షిప్​లో ఉన్నాడంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ ఇంటర్నెట్​ను షేక్ చేస్తోంది. హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడట. ఓ సెలబ్రిటీతో డేటింగ్​లో ఉన్నాడట. అయితే అంతా అనుకున్నట్టు ఆమె అనన్యా పాండే కాదు. బ్రిటీష్ సింగర్, టీవీ ఆర్టిస్ట్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్​లో ఉన్నాడట. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్​కు వెళ్లినట్టు ఇప్పుడు నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది.

అయితే హార్దిక్ పాండ్యా తాజాగా తన ఇన్​స్టాలో గ్రీస్​లోని ఓ హోటల్ పూల్ దగ్గర తీసుకున్న వీడియో పోస్టు చేశాడు. అయితే నాలుగు రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్​లో ఫొటోలు దిగి పోస్టు చేసింది. దీంతోనే రూమర్స్ మొదలు కాలేదండోయ్. ఈ ఇద్దరూ ఈ లొకేషన్​లో తీసుకుని షేర్ చేసిన పోస్టులను పరస్పరం లైక్ చేయడం ఇప్పుడు ఈ రూమర్​కు ఊపిరి పోసింది. దీంతో ఈ ఇద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది. ఇక గతంలోనూ జాస్మిన్‌ పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్య కామెంట్లు చేయడంతో ఏదో నడుస్తోందనే టాక్ వైరల్ అవుతోంది.

జాస్మిన్ వాలియా ఎవరు?

ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌ ప్రాంతానికి చెందిన జాస్మిన్‌ బ్రిటీష్ టీవీ సిరీస్​లలో నటించింది. పలు రియాల్టీ షోలలో పాల్గొని పాపులర్ అయింది. 2014లో సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ భామ పాడిన ‘బామ్‌ డిగీ’ పాటను బాలీవుడ్​లో రీమేక్ కూడా చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో నటాషాకు ప్రపోజ్ చేశాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా ఆగస్త్యకు జన్మనిచ్చింది. 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో మరోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జులై 19న విడిపోతున్నట్లు ప్రకటించారు.

 

Share post:

లేటెస్ట్