iPhone 16 Leaks: త్వరలోనే మార్కెట్లోకి ఐఫోన్ 16.. ఫీచర్స్ లీక్!

Mana Enadu: ప్రపంచం డిజిటల్ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జనం స్మార్ట్ ఫోన్లనూ వినియోగిస్తున్నారు. మార్కెట్లోకి ఎప్పుడు కొత్తరకం ఫోన్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు దానిని కొనుగోలు చేసేంతగా రోజులు మారిపోయాయి. పదో తరగతి పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ అరచేతిలో ఫోన్ లేనిదే పూట గడవడం లేదు. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే కనిపిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగానే మొబైల్ కంపెనీలూ కొత్త కొత్త ఫీచర్లు, మోడల్స్, డిజైన్లతో ఫోన్లు తయారు చేస్తున్నాయి. తాజాగా గూగుల్ పిక్సెల్ 9, సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్‌లను విడుదల చేశాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు Apple iPhone 16 సిరీస్‌పై పడింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ iOS 18తో వస్తోంది. అయితే ఇది లాంచ్ చేయడానికి ముందే 16 సిరీస్ ఫోన్ కెమెరా ఫీచర్లు, డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

 నాలుగు మోడళ్లలో కొత్త ఫోన్లు

ఐఫోన్ 16 సిరీస్ కొన్ని ఫీచర్లు, బ్యాక్ డిజైన్‌లో మార్పులతో ఐఫోన్ 15 వంటి ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉండబోతోందట. Apple iPhone 16 Pro స్క్రీన్ 6.3 ఇంచెస్ ఉండే అవకాశం ఉంది. అయితే iPhone 16 Pro Max 6.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ మార్పులు ప్రో వేరియంట్‌లకు మాత్రమే పరిమితం కావచ్చు. అంటే iPhone 16, iPhone 16 Plus వాటి పాత మోడల్‌ల వలే ఉంటాయని తెలుస్తోంది. ఆపిల్ మొత్తం 4 మోడళ్ల కోసం కొత్త క్యాప్చర్ బటన్‌పై కూడా పని చేస్తోంది.

 సెప్టెంబర్ 20న మార్కెట్లలో విడుదల: బ్లూమ్‌బెర్గ్ నివేదిక

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ వనిల్లా ఐఫో కెమెరా సామర్థ్యాలలో చాలా పెద్ద అప్‌గ్రేడ్‌లు కనిపించాయి. అయితే ఈసారి రాబోయే ఐఫోన్ 16లో తక్కువగా కనిపిస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల కోసం ఐఫోన్ 15 లైనప్‌లో కనిపించే అదే 48MP సెన్సార్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Apple JPEG-XL అనే కొత్త ఫోటో ఫార్మాట్‌ను పరిచయం చేస్తుందని తాజా నివేదిక పేర్కొంది. కాగా సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో Apple iPhone 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. అయితే ఖరీదైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేసిన అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, డిస్‌ప్లేలు 0.2తో అమర్చబడి ఉంటాయట. వీటి పాత మోడళ్ల కంటే అంగుళాలు పెద్దవి, అలాగే పెద్ద బ్యాటరీలు ఉంటాయని బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు కావాలంటే సెప్టెంబర్ 10 వరకూ వేచి చూడక తప్పదు.

 ధర ఈ రేంజ్‌లో ఉండొచ్చు..

తాజాగా లీక్ అయిన ధర & స్పెసిఫికేషన్ల ప్రకారం, iPhone 16 ధర $799 అంటే భారతదేశంలో దాదాపు రూ. 68,000, iPhone 16 Plus ధర $899 అంటే రూ. 75,000 కంటే ఎక్కువ, iPhone 16 Pro ధర $1099 అంటే రూ. 92,000 కంటే ఎక్కువ అలాగే iPhone 16 Pro Max ధర $119 కంటే ఎక్కువ. రూ.లక్షపైనే ఉండొచ్చు.

Related Posts

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

iPhone SE4: టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈనెల 19న మార్కెట్లోకి ఐఫోన్ ఎస్ఈ4

మొబైల్ లవర్స్‌కు వాలంటైన్స్ డే సందర్భంగా ఆపిల్ సంస్థ(Apple Company) శుభవార్త చెప్పింది. టెక్ ప్రియులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తోన్న ఐఫోన్ ఎస్ఈ4((iPhone SE4))ను ఈనెల 19న మార్కెట్లలోకి విడుదల చేయనున్నట్లు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్(Apple CEO Tim…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *