తెలుగుదేశం పార్టీకి ఖమ్మం లోక్‌సభ టిక్కెట్టును భాజపా కేటాయిస్తుందన్న వార్తలు ప్రచారం మాత్రమేనని, తనకే టికెట్ వస్తుందని భాజాపా నేత జలగం వెంకట్రావు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ స్థానంపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని ఆయన కలిశారు. తనకు ఖమ్మం టికెట్ కేటాయింపుపై ఆయన మాట్లాడారు.
సమావేశం అనంతరం జలగం వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నేతలను క్యాజువల్‌గా కలిశామన్నారు. ఒక్క వరంగల్ టికెట్ ను ఆపితే బాగుంటుందని ఖమ్మం అభ్యర్థి ప్రకటనను కూడా నిలిపివేసినట్లు తేలింది. 17 లోక్‌సభ స్థానాలకు 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే వరంగల్ నుంచి అరూరి రమేష్‌కు బీజేపీ టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.