వార్నీ.. జపాన్ ఇలా చేస్తోందా.. పల్లె యువకులకు పెళ్లి చేసేందుకు పెద్ద ప్లానే!

Mana Enadu: కాలేజీకి వెళ్లు.. వెళ్లావా పాస్​ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, చేసుకున్నావా, పిల్లల్ని కను.. ఇదే సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష. ఇక పల్లెల్లు, గ్రామాల్లో యువతులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు వారి కుటుంబీకులు. కనీసం వాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒకప్పుడు తల్లిదండ్రులు(Parents) ఎవర్ని చూసి అమ్మా.. ఇతనే నీకు కాబోయే వాడు అని చెప్పగానే మరోమాట మాట్లాడకుండా మెడలు వంచి తాళి కట్టించుకునే వారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయ్.. టెక్నాలజీ(Technology) మారింది. గ్రామాలు, పట్టణాలు అని కాకుండా ప్రతి యువతి తాను సిటీలో ఉండాలి, మంచి జాబ్(Job) చేసే యువడినే పెళ్లాడాలనే ధోరణీలో ఉంటున్నారు. దీంతో పెళ్లీడు దాటిపోయినా 50శాతం మందికి పెళ్లిళ్లే కావడం లేదు. మన దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే జనాభా(Population) తగ్గుదల ఉన్న జపాన్‌(Japan)లో పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇంతకీ ఏంటీ పెళ్లి.. అమ్మాయిల గోల అనుకుంటున్నారా..? అయితే పదండి తెలుసుకుందాం..

 పల్లె బాట పట్టించేందుకు ఆర్థిక సాయం

జపాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో
రాజధాని టోక్యో(Tokyo)లో నివసించే ఒంటరి మహిళలను పల్లె బాట పట్టించేందుకు.. వారికి ఆర్థిక ప్రోత్సాహకం(Financial Support) అందించేలా జపాన్ ప్రభుత్వం ఒక ప్లాన్ సిద్ధం చేసింది. పల్లె ప్రాంతాల్లో యువకులతో పోలిస్తే యువతుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమవుతోంది. 2020 నాటి జపాన్ జనాభా లెక్కల ప్రకారం టోక్యో నగరం కాకుండా.. జపాన్‌లోని మిగతా ప్రాంతాల్లో 11.1 మంది పెళ్లి కాని లేదా ఒంటరి పురుషులు ఉండగా.. మహిళలు మాత్రం 20 శాతం తక్కువగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఈ గ్యాప్ దాదాపు 30 శాతంగా ఉంది. అంటే వందలో 30 మంది యువకులకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి. దీంతో జపాన్ ప్రభుత్వం టోక్యో నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న ఒంటరి మహిళలకు ఛార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాల రూపంలో 6 లక్షల యెన్‌లు, మన కరెన్సీలో రూ.3.45 లక్షలు ఇవ్వాలని భావించింది. కానీ ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఈ ప్లాన్‌ను సమీక్షించాలని జపాన్ సహాయక మంత్రి హనకో జిమీ ఆదేశించారు.

 పిల్లలను కనడమే వారి పనా?

అయితే ఆడపిల్లలంటే ఆట బొమ్మలనుకుంటున్నారా..? పిల్లలను కనడమే వాళ్ల పనా..? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు సమస్య మూలాలను పట్టించుకోకుండా.. ఈ ప్రోత్సాహకాలతో ఒరిగేదేముందని జపాన్ ప్రధాని సలహాదారే వ్యాఖ్యానించారట. దీంతో ప్రస్తుతానికైతే జపాన్ ప్రభుత్వం(Japan Govt) తన ప్లాన్‌ను నిలిపేసింది. మరీ కామెడీ కాకపోతే.. 6 లక్షల యెన్‌(YEN)లకు ఆశపడి.. ఎవరైనా సిటీ లైఫ్‌ను, అక్కడుండే సదుపాయాలను వదులుకొని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారా..? అది కూడా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు.. ఇదిలా ఉండగా జనాభా తగ్గుదలపై జపాన్ ప్రభుత్వం చేయని ప్రయత్నమూ లేదట. ఈ ఏడాది జూన్‌లో ఓ డేటింగ్ యాప్‌(Dating Aap)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పెళ్లిళ్ల రేటు తగ్గడం.. అంతకు మించి జననాల రేటు తగ్గడం పట్ల జపాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2070 నాటికి జపాన్ జనాభా 30 శాతం తగ్గి 87 మిలియన్లకు పడిపోతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ అంచనా వేసింది.

Share post:

లేటెస్ట్