జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ .. కాంప్లిమెంటరీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. ఇదిగో వివరాలు!

Mana Enadu:రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్. వినియోగదారుల కోసం ఈ కంపెనీ మూడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ రీఛార్డ్ ప్లాన్స్.. ఓటీటీ (ఓవర్ ది టాప్) సబ్‌స్క్రిప్షన్లతో కలుపుకొని వస్తున్నాయి. మీరు ఈ ప్లాన్ రీఛార్డ్ చేసుకుంటే ఇంటర్నెట్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌కు అదనంగా ప్రముఖ ఓటీటీల కంటెంట్​ను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.

రూ.329 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజు 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తుంది. వీటికి తోడుగా 28 రోజుల వ్యాలిడిటీతో ‘జియో సావన్ ప్రో’ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ.949 ప్లాన్ : ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజు 2 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. వీటితోపాటు 84 రోజుల వ్యాలిడిటీతో ‘డిస్నీ + హాట్ స్టార్’ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
రూ.1,049 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌ సదుపాయం ఉంటుంది. కాంప్లిమెంటరీగా.. 84 రోజుల వ్యాలిడిటీతో ‘జీ5 – సోనీ లివ్’ కాంబో సబ్​స్క్రిప్షన్ ప్లాన్ వస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ కూడా వస్తోంది.

మరోవైపు జియో తాజాగా  ‘జియో భారత్ జే1 4జీ’ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. బ్లాక్, గ్రే కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది.  దీన్ని అమెజాన్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు.

 

Share post:

లేటెస్ట్