మన Enadu: జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక వాణిజ్య సముదాయంలో మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకాణం పూర్తిగా దగ్ధమయ్యాయి.
వాచ్ షాప్, మరో రెండు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లిలోని అగ్నిమాపక దళాలు వచ్చి సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసింది. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పరిశీలించారు.