Chintakani|ఘనంగా శ్రీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చింతకాని మండల కేంద్రంలోని శ్రీచెన్నకేశవ స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. హోలీ పౌర్ణమి నాడుప్రతి ఏటా శ్రీభూనీళ సమేత శ్రీచెన్నకేశవ స్వామి (Chenna kesava swami)తిరు కల్యాణ మహోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిపిస్తారు.

ఈ సందర్భంగా ఆరు రోజలు పాటు అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. తొలిరోజు తొళక్కం,
దివ్య ప్రబంధం, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. రెండోరోజు ఉదయం 4గంటలకు సుప్రభాత సేవ, ప్రాభోధిక ఆరాధన, తిరువాయిమజి సేవాకాలం, స్వామి ఆరాధన వంటి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మూడోరోజు ప్రబంధ పారాయణం, నమ్మాళావరుల, పరమపదోత్సవం, బ్రహోత్సవం ప్రారంబ అంకురార్పణ కార్యక్రమాలు చేస్తారు. నాల్గొవరోజు మూర్తి కుంభ స్తాపన , అగ్నిప్రతిష్టాపన మూల మంత్ర హోమం త్వజారోహణంసర్వదోహం ఉన్నవారికి గరుడ ముద్ద ఇస్తారు.

ఐదోరోజు బలిహరణం, ఎదుర్కొలు ఉత్సవాల అనంతరం అన్నదానం కార్యక్రమం చేపడతారు. అదే రోజు రాత్రి 8గంటలకు చెన్నకేశవస్వామి తిరు కల్యాణం జరిపిస్తారు.చివరి రోజు తిరువీధి ఉత్సవం చేస్తారు.

Share post:

లేటెస్ట్