మన ఈనాడు: పుట్టినరోజు పార్టీలో కేకు తిన్న కొద్ది సేపటికే వాంతులు , విరోచనాలతో హస్పటల్ అడ్మిట్ అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
పాల్వంచ పట్టణానికి చెందిన నరసింహరావు తన కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. ఈక్రమంలోనే పాల్వంచలోనే ఐస్ మ్యాజిక్ అనే బేకరీకి వెళ్లి కిలో కేకు ఆర్డర్ చేశారు.
నిల్వచేసిన కేకును బేకరీ ఓనర్ నరసింహరావుకు విక్రయించాడు. దీంతో కేకుకు బూజు పట్టిన విషయం గమనించలేదు. అదే కేకుతో పుట్టినరోజు వేడుకల్లో కట్ చేసి అందరూ కలిసి తిన్నారు. ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎన్న ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ట్రిట్మంట్ చేసే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై బాధితుడు నరసింహరావు పాల్వచ మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేశాడు. విచారణ చేసి రూ.7వేలు ఫైన్ వేశారు. మరోసారి నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటేషన్ అధికారి కేవీ లక్ష్మణ్రవు, హెచ్చరించారు.