ManaEnadu:అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాసపు అరాచకాన్ని.. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా.. ఓ పవిత్ర భారతమా
అని సింధూరం సినిమాలో 19వ శతాబ్దంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ లిరిక్స్‌లో ఉన్న వాస్తవాలు 20వ శతాబ్దం వచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 78 వసంతాలు పూర్తయినా భారతమాత లాంటి స్త్రీలు నిత్యం ఏదో ఒక చోట మృగాళ్లాంటి మనుషుల మధ్య నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. ఢిల్లీ నిర్భయ ఘటన మరువక ముందే తాజాగా కోల్‌కతాలో అలాంటి సంఘటన ప్రస్తుతం దేశాన్నికుదిపేస్తోంది.
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతో దేశం ఉలిక్కిపడుతోంది. ఓ వైపు ప్రపంచం ఆధునికతవైపు పరుగులు తీస్తుంటే మనం మాత్రం ఇలాంటి దిగజారుడు పనులతో ఆ ప్రపంచమే మనల్సి చూసి నవ్వుకునేలా ప్రవర్తిస్తున్నాం. స్వేచ్ఛాసంకేళ్లు తెంచుకున్న ఈ భారతావనిలో ఇంకెప్పుడు మాకు స్వేచ్ఛ లభిస్తుందని ‘‘ఆమె’’ ప్రశ్నిస్తోంది.. ఏం సమాధానం చెబుదాం.. చెప్పండి. చట్టంలో లొసుగుల పేరుతో తప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతోంటే అన్యంపుణ్యం తెలియని మన సోదరీమణులు తమ జీవితాలను ఇలా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తోంది.
ఇంకెన్ని రోజులు ఇలా..
మనకంటే చిన్నచిన్న దేశాలు తప్పు చేస్తే వెంటనే నిందితుడికి నడిరోడ్డులోనే శిక్షలు వేస్తుంటే..మనం మాత్రం చట్టం, న్యాయం, కోర్టులు, జైళ్లు అంటూ కాలయాపన చేస్తోంటే.. గాయపడిన మనసులకు, వారిని కనిపోషించిన తల్లిదండ్రులకు న్యాయం జరిగేది ఎప్పుడు? వారు సమాజంలో తలెత్తుకుని తిరిగేదెన్నడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేది ఎవరు? ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే రేపటి రోజు మన ఇంట్లో వారికే ఇలాంటి ఘటన ఎదురుకావచ్చొ. ఆలోచించండి. అన్యాయాన్ని అప్పడే ఎదురించండి.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…