ED Raids At MLC Kavitha House : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె ఇంటికి ఈడీ అధికారులు వచ్చారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసేందుకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఈడీ కవితను ఢిల్లీలో విచారించింది. తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. ఈడీతోపాటు ఐటీ శాఖ కూడా ఈ సోదాలు చేపట్టిందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి 10 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు వచ్చింది. మొత్తం 4 బృందాలు తనిఖీలు చేపట్టాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఆమె భర్త వ్యాపార వ్యవహారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ ఆఫీసర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ, ఐటీ తనిఖీలు నేపథ్యంలో బంజారాహిల్స్ లోని కవిత ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా కేంద్ర భద్రతా బలగాలను అక్కడ మోహరించారు.
ఎమ్మెల్సీ కవితను డిల్లీ తీసుకెళ్లేందుకు ఈడి అధికారులు ఇప్పటికే విమానం టిక్కెట్లు సైతం బుక్ చేసినట్లు తెలుస్తోంది. కవిత నివసానికి ఇప్పటికే కేటీఆర్‌తోపాటు హరీష్‌రావు చేరుకున్నారు. రాత్రి 8.45గంటలకు డిల్లీ తీసుకెళ్లనున్నట్లు సమాచారం అందించారు. కవిత వాడిన 14సెల్ఫోన్లు సైతం సీజ్ చేసినట్లు సమాచారం.
ఒకవైపు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన జరుగుతుండగానే కవిత అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయశంగా మారింది. ఆరునెలలుగా కవిత అరెస్ట్‌పై ప్రచారం తప్ప ఈడీ కేసు పురోగతి ఉండటం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రేపు (శనివారం) పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడతున్న క్రమంలోనే అరెస్ట్ కావడం చర్చకు దారితీసింది. ఈక్రమంలో కేసీఆర్ నిజామాబాద్ నుంచి పార్లమెంట్ బరిలో నిలపలేదని వాదనలు వినిపిస్తున్నాయి.