ManaEnadu: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల (Telangana Rains)కు జనజీవనం అస్తవ్యస్తమయింది. చాలా ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైకి వరద చేరి పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. 30కి పైగా రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తూ.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపింది. రద్దయిన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి.
రద్దయిన ముఖ్య రైళ్ల వివరాలివీ..
17233 సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ (Vande Bharat) (వందేభారత్)
12714 సికింద్రాబాద్-విజయవాడ (శాతవాహన)
12762 కరీంనగర్-తిరుపతి (సూపర్‌ఫాస్ట్)
12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్)
17202 సికింద్రాబాద్ (Secunderabad)-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (Golconda Express))
12706 సికింద్రాబాద్-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12704 సికింద్రాబాద్-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
17201 గుంటూరు సికింద్రాబాద్ (గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
12705 గుంటూరు-సికింద్రాబాద్ (ఇంటర్ సిటీ)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
17230 సికింద్రాబాద్-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్ (శబరి ఎక్స్‌ప్రెస్)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
మరోవైపు రైళ్లు రద్దవడం, రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో విజయవాడతో పాటు రాయనపాడు రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
ఈ క్రమంలో ప్రయాణికులకు రైల్వే అధికారులు స్టేషన్‌లో భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. మరోవైపు రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ (Railway Track Restoration) పనులు చేపట్టగా.. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు రైళ్లను రద్దును పొడిగించే అవకాశమున్నట్లు సమాచారం.
మరోవైపు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారు కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు పట్టాల (Floods On Railway Tracks)పై వరద ప్రవహించడంతో కంకర కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ ధ్వంసమై విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ నుంచి అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి.