ప్రభాస్ రూ.2 కోట్లు.. అల్లు అర్జున్ రూ.కోటి.. వరద బాధితులకు పాన్ ఇండియా స్టార్ల విరాళం

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో వరదలు (Telugu State Floods సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఈ విలయంతో లక్షల మంది భారీగా నష్టపోయారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలోకి బురద చేరి ఏ వస్తువూ పనికి రాకుండా పోయింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయి వరద బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ కలలన్నీ బురదగా మారడం చూసి కన్నీరు పెడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Flood Donations) ప్రముఖులు ముందుకొస్తున్నారు.

వరద బాధితులకు సాయం చేసేందుకు తాజాగా పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas Flood Donation) ముందుకొచ్చాడు. సాధారణంగా కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడంలో ఎప్పుడూ ముందుండే డార్లింగ్ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించాడు. తాజాగా ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆయన వ్యక్తిగత టీమ్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ప్రభాస్ (Prabhas Donates Rs. 2 Crores) చెరో రూ.కోటి ప్రకటించాడు. ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ప్రకటించిన విరాళాల్లో ప్రభాస్‌ ప్రకటించిన నగదే అత్యధికం.

మరోవైపు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థిస్తున్నానని బన్నీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు.

ఇప్పటికే చిరంజీవి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, మహేశ్‌బాబు (Mahesh Babu) రూ.కోటి, ఎన్టీఆర్‌ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, అనన్య నాగళ్ల రూ.2.5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కల్కి చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న వైజయంతి మూవీస్‌ ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (ap cm relief fund)కు రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు తెలిపింది.

Related Posts

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *