Allu Arjun – Balakrishna : బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు ఐకాన్ స్టార్

ManaEnadu:నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ కి తెలుగు సినీ ఇండస్ట్రీ ఆహ్వానం పలికారు.

బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్స్ తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం లోని స్టార్స్ ని కూడా పిలుస్తున్నారు. ఈ వేడుకలకు స్టార్ నటీనటులు రాబోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి.. ఇలా అనేక మంది స్టార్స్ వస్తున్నారని తెలియడంతో ఇంతమంది ఒకే వేదికపై కనపడబోతున్నారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ , తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి , మా అసోసియేషన్ నుండి మాదాల రవి , శివ బాలాజీ , నిర్మాత ముత్యాల రామదాసు పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్