Mana Enadu: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్(Big Boss 8) ఫీవర్ మొదలైంది. ఈ బుల్లితెర రియాలిటీ షో(Reality Show) కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం(Sunday) (సెప్టెంబర్ 1) బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో 8 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ టీవీ ఛానెల్ స్టార్ మా (Star Maa), ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో ప్రసారం కానుండగా అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni) మరోసారి హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి సుమారుగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారని తాజా సమాచారం. మొదటి రోజున 14 మందిని ప్రవేశపెట్టి.. రెండో రోజున మిగతా వారిని పంపించనున్నారు. అలాగే వైల్డ్ కార్డ్(Wild Card)తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల(contestants)ను నాలుగు లేదా ఐదో వారంలో పంపిస్తారు.సాధారణంగా బిగ్ బాస్‌లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్ లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి ఫేజ్ లో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 మంది హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఒక్కరోజు ముందు షూటింగ్
అయితే, ఈ షోను అధికారికంగా మనకు సెప్టెంబర్ 1న ప్రసారం చేస్తారు. కానీ, దానికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఒకరోజు ముందు జరుగుతుంది. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ ఎంట్రీని ఇవాళే (ఆగస్ట్ 31) షూట్ చేస్తారు. మొన్నటి నుంచి డ్యాన్స్ పర్ఫామెన్సెస్ జరుగుతున్నాయి. ఇక శనివారం నాడు బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నారు. ప్రోగ్రామ్ ఆదివారం ప్రారంభమైన షూటింగ్ మాత్రం ఇవాళ జరగడంతో హౌజ్‌మెట్స్ ఎంట్రీ ఇవాళే ఉండనుందన్నమాట.
బిగ్‌బాస్‌కి ఎందుకింత క్రేజ్
సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్‌బాస్ షో. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. సాధారణంగా జనాలు, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు యాక్షన్ కన్నా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే తీవ్రమైన వాదనలు, పోటీలు ఉండే ఈ షోను తెగ ఇష్టపడుతుంటారు. ఈ షోలో వివిధ మైండ్‌సెట్ గలవారు ఉంటారు కాబట్టి.. కొన్ని పరిస్థితుల్లో వీరు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆసక్తిగా ఉంటారు. పోటీదారుల మధ్య వైరం, స్నేహం ఎలా సాగుతుందోనని ఉత్సుకతతో.. తర్వాత ఎపిసోడ్ కోసం కచ్చితంగా ఎదురుచూస్తుంటారు. అయితే కొందరు తమకు నచ్చిన కంటెస్టెంట్ కోసం కూడా BB చూస్తుంటారు. వారిది తప్పైనా, రైటైనా వారినే సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఎక్కువ ఫ్యాన్‌బేస్ ఉన్నంత మాత్రాన ఆ కంటెస్టెంట్ విజేతగా నిలువరని కొన్ని సీజన్స్ నిరూపించాయి. మరి 8వ సీజన్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ షో పూర్తయ్యే వరకూ వేచిచూడాల్సిందే..