Committee Kurrollu :  ఓటీటీలోకి ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎప్పుడంటే?

ManaEnadu:ఆగస్టులో థియేటర్లలో సందడి చేసిన సినిమాల్లో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ఒకటి ‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)’. యదు వంశీ అనే కొత్త డైరెక్టర్ దాదాపు 19 మంది కొత్త నటులతో ఈ సినిమాను తెరకెక్కించాడు. మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ‘ఈటీవీ విన్‌ (ETV Win)’ ఓటీటీలో ఈ మూవీ రాబోతున్నట్లు ప్రకటించారు.  ‘‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులోనే రాబోతున్నారు’ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది ఓటీటీ. విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే వినాయక చవితి (Vinayaka Chaviti)ని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలున్నాయని నెటిజన్లు అంటున్నారు.

కమిటీ కుర్రోళ్ల కథ ఏంటంటే..? : గోదావ‌రి జిల్లాల్లోని ఓ మారుమూల ప‌ల్లెటూరు పురుషోత్తంప‌ల్లిలో  ప‌న్నెండేళ్ల‌కు ఒక‌సారి భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌ జరుగుతుంది. ఈసారి జాత‌ర జ‌రిగిన ప‌దిరోజుల‌కు ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆ ఊరి ప్ర‌స్తుత స‌ర్పంచ్ బుజ్జి (సాయికుమార్‌)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. గ‌త జాత‌ర స‌మ‌యంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాత‌ర పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లు పెట్ట‌కూడ‌ద‌ని పంచాయితీలో ఊరి పెద్ద‌లు తీర్పునిస్తారు.  ఆ త‌ర్వాత ఏమైంది?  ప‌న్నెండేళ్ల క్రితం కులాల గొడ‌వ వ‌ల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్క‌ట‌ైంది? ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచారు? అన్న‌దే కమిటీ కుర్రోళ్ల కథ.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *