Mana Enadu:మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న మరో సినిమా ‘దేవర’ (Devara). రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన.. సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులకు హైప్ క్రియేట్ చేశాయి. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే దేవర మూవీ రిలీజ్(Devara Release)కు ఇంకా 25 రోజులు ఉంది. ఇప్పటికే సూపర్ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ (Devara Pre Bookings in Canada) ఇవాళ (సెప్టెంబరు 2వ తేదీ 2024) కెనడాలో షురూ అయ్యాయి. దాదాపు 25 స్క్రీన్లలో ఇక్కడ దేవర గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ప్రీ బుకింగ్ మొదలైన కేవలం 6 నిమిషాల్లోనే టికెట్స్ అన్నీ అమ్ముడు పోయాయట. గ్రేటర్ టొరంటో (Great Toronto) ఏరియాలోని లీడింగ్ మల్లీప్లెక్స్ చైన్ మార్కెట్‌లో ఉన్న యార్క్ సినిమాస్, వుడ్ సైడ్ స్క్వేర్ సినిమాస్, అల్బియాన్ సినిమాస్, సెంట్రల్ పార్క్ వే సినిమాస్ స్క్రీన్లపై ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డ్స్ (సోల్డ్ ఔట్) దర్శనమిస్తున్నాయట.
ఈ బుకింగ్స్ చూసిన ‘దేవర’ ఫ్యాన్స్ ప్రీమియర్లలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లోనే ఈ రేంజ్‌లో ఎన్టీఆర్ మేనియా ఉంటే.. ఇక తెలుగునాట ఈ చిత్రం రిలీజ్ సమయంలో ఇంకా ఏ రేంజ్ హైప్ ఉంటుందోనని అభిమానులు అంటున్నారు. ఓవర్సీస్‌లో దేవరకు వస్తున్న క్రేజ్ చూసి.. వరల్డ్ వైడ్‌గా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలని అంటున్నారు.
సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా కొరటాల శివ (Koratala Shiva) దేవరను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh) సంగీతం అందిస్తున్నారు. సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.