మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ మూవీ.. హింట్ ఇచ్చిన డైరెక్టర్

ManaEnadu:నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 1వతేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌గా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల సమయంలో నగరంలో భారీ వర్షాలు కురిశాయి. మొదట ఈ వేడుకలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) టాలీవుడ్ అంరంగేట్రం గురించి ప్రకటన ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈవెంట్‌లో ఈ ప్రకటన జరగలేదు

.
అయితే మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ (Director Prashant Varma)తో ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇక తాజాగా డైరెక్టర్ వర్మ తన సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ కీలక పోస్టు షేర్ చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న ఈ రూమర్స్​ను నిజమే అన్నట్లు తాజాగా ఆయన ఓ స్పెషల్ ఫోటో పెట్టి హింట్ ఇచ్చారు.

‘లయన్ కింగ్ (Lion King)’ యానిమేటెడ్ మూవీలో చిట్టి సింబాను పరిచయం చేసే సీన్​కు సంబంధించిన ఫొటోను ప్రశాంత్ వర్మ షేర్ చేశారు. “A new dawn is breaking at @ThePVCU” సింబా రానుంది (Simba Is Coming)” అంటూ క్యాప్షన్​ యాడ్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈయన పెట్టిన పోస్ట్ కచ్చితంగా మోక్షజ్ఞ గురించే అని కామెంట్లు పెడుతున్నారు. త్వరగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చేయండి అంటూ ప్రశాంత్ వర్మకు రిక్వెస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Share post:

లేటెస్ట్