Vishwambhara:ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్​తో ‘విశ్వంభర’.. మూవీపై హైప్ పెంచేసిన డైరెక్టర్ వశిష్ఠ

ManaEnadu:సెకండ్ ఇన్నింగ్స్​లో మెగాస్టార్ చిరంజీవి కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. ఆచితూచి చేస్తున్నా.. ఆచార్య, ‘భోళాశంకర్’ వంటి డిజాస్టర్లు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ రెండు డిజాస్టర్ల​​ తర్వాత మెగాస్టార్​​​ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్​​ మూవీ ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీగా ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరు కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ఓ క్రేజీ న్యూస్ చెప్పారు.

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ విశ్వంభర టీజర్ వస్తుందని అందరూ ఊహించినా.. కేవలం పోస్టర్​తోనే సరిపెట్టుకుంది చిత్రబృందం. అయితే మెగాస్టార్​కు స్పెషల్​గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ.. పోస్టర్​ మాత్రమే రిలీజ్ చేసినా.. ఈ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేసే న్యూస్ ఒకటి షేర్ చేసుకున్నారు. ఇంతకీ అదేంటంటే?

“విశ్వంభర.. మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి. మీ అంచనాలకు మించే ఈ సినిమా ఉంటుందని నేను మాటిస్తున్నా. చిరంజీవి అభిమానులంతా కాలర్ ఎగరేసేలా, ఓ సగటు చిరు అభిమానిగా నేను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. బాస్​ను అంతా ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తాను. ఒకప్పటి వింటేజ్ చిరును చూపిస్తూనే.. మెగాస్టార్​తో ఇప్పటి వరకు ఎవరూ చేయని సబ్జెక్ట్​తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ప్రతి మెగా అభిమాని మనసు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. టీజర్ అనౌన్స్​మెంట్ త్వరలోనే ఉంటుంది. అప్పుడు చూస్తారుగా ఈ సినిమా ఏ రేంజ్​లో ఉండబోతోందో?”.. అంటూ వశిష్ఠ ఈ చిత్రంపై భారీగా అంచనాలు క్రియేట్ చేశాడు.

విశ్వంభర సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి మనదేనంటూ వశిష్ఠ తాజాగా మరోసారి నొక్కి వక్కానించారు. సంక్రాంతి విన్నర్ విశ్వంభర అని తెలిపారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష నటిస్తోంది. స్టాలిన్ తర్వాత ఈ జంట మరోసారి కలిసి పని చేస్తోంది. ఇక ఆమెతో పాటు అశికా రంగనాథ్, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share post:

లేటెస్ట్