RamCharan:ఆమెను ఎప్పటికీ మరిచిపోలేను.. ఆమే నా ఫేవరెట్ హీరోయిన్ : రామ్ చరణ్

ManaEnadu:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు నచ్చిన హీరో హీరోయిన్లు ఎవరో కూడా చెప్పేశాడు. తాజా ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్​ రౌండ్​లో క్విక్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన లైఫ్​లోనే బెస్ట్ ఫ్యాన్ మూమెంట్​ను షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్. మరి ఆ ముచ్చట్లేంటో తెలుసుకుందామా?

ఈ ఇంటర్వ్యూలో థ్రిల్లర్, కామెడీ ఏ జానర్ సినిమాలు చేయడం ఇష్టమని హోస్టు అడగగా.. తాను కామెడీ ఎప్పుడూ ట్రై చేయలేదని.. డైరెక్టర్ బుచ్చిబాబుతో తాను చేయబోతున్న సినిమా ఈ జానర్​లోనే ఉండబోతోందని #RC16 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దీంతో బుచ్చిబాబు-రామ్ చరణ్ ఈసారి నవ్వులు పంచేందుకు కలిసి వస్తున్నారంటూ నెటిజన్లు అంటున్నారు.

తన లైఫ్​లో మరిచిపోలేని ఫ్యాన్ మూమెంట్ అడగ్గా.. ఇండియాలో తనకు చాలా మందిఫ్యాన్స్ ఉన్నారని.. కానీ జపాన్​లో 70 ఏళ్ల ఓ పెద్దావిడ తనపై చూపించిన అభిమానం మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు ఈ గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినప్పుడు ఓ 70 ఏళ్ల పెద్దావిడ తనకు ఓ బుక్ ఇచ్చిందని.. 180 పేజీల ఆ పుస్తకంలో తాను అప్పటి వరకు నటించిన సినిమాల్లోని పాత్రలకు సంబంధించిన ఫొటోలున్నాయని తెలిపాడు. ఆ ఫొటోలన్నింటిని ఆమే స్వయంగా డ్రా చేసిందని.. భాష తెలియకపోయినా ఆమె తనపై చూపించిన అభిమానం తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చరణ్ చెప్పాడు.

మరోవైపు తన ఫేవరెట్ జానర్ గురించి మాట్లాడుతూ.. రొమాన్స్ కంటే తనకు యాక్షన్ సినిమాలే ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాల్లో ఆరెంజ్, రంగస్థలం అంటే చాలా ఇష్టమని తెలిపాడు. కానీ మగధీర తన కెరీర్​ను మలుపు తిప్పిన ల్యాండ్ మార్క్ మూవీ అని.. తన ఫ్యాన్స్​కు కూడా ఆ చిత్రమంటే ఎక్కువ ఇష్టమని.. అందుకే తాను కూడా అదే పేరే చెబుతానని అన్నాడు.

ఇక తన ఫేవరెట్ హీరో ఎవరని అడగ్గానే ఠక్కున సూర్య అని సమాధానం చెప్పాడు చెర్రీ. ఈ ఆన్సర్ విని యాంకర్​తో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా తన ఇంటి కాంపౌండ్​లో స్టార్ హీరోలు ఉండగా ఫేవరెట్ హీరో సూర్య అని చెప్పడంతో అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. ఇక ఫేవరెట్ హీరోయిన్ గురించి అడగ్గా చాలా మంది ఉన్నారంటూనే ఈ జనరేషన్​లో సమంత అంటూ తన రంగస్థలం కోస్టార్ పేరు చెప్పేశాడు చెర్రీ.

 

Share post:

లేటెస్ట్