Tumbbad Re-Release: థియేటర్లలోకి మరో రీరిలీజ్ మూవీ.. ఎప్పుడో తెలుసా?

Mana Enadu: ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఓల్డ్ సినిమాల రీరిలీజ్(Re-Release) ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో మురారీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర, వెంకీ వంటి సినిమాలు బాక్సాఫీస్(Box Office) వద్ద మరోసారి రిలీజ్ అయి ట్రెండ్ సెట్ చేశాయి. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమాలు దూసుకెళ్లాయి. అటు బాలీవుడ్‌(Bollywood)లో కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రీ నటించిన లైలా మజ్నూ, రణబీర్ కపూర్(Ranbeer Kapoor) రాక్ స్టార్‌ని రీరిలీజ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్‌లో ఓ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ తంబాడ్(Tumbbad) కూడా చేరింది. ఈ మూవీ రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తొలుత ఈ మూవీని ఆగస్టు 30న రీరిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా తేదీ మార్చారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

 అప్పట్లోనే రూ.5కోట్ల కలెక్షన్స్

తుంబాడ్(Tumbbad) చిత్రం మొదట అక్టోబర్ 12, 2018న విడుదలైంది. కేవలం రూ. 5కోట్ల బడ్జెట్(Budget)తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 13.6 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌(Filmfare Awards)లో మూడు అవార్డులను గెలుచుకుంది. ఓటీటీ(OTT0లో అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు అని సెర్చ్ చేస్తే కచ్చితంగా తుంబాడ్ సినిమా కనపిస్తుంది. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది. సుమారు 62 వేల మంది ఈ చిత్రానికి ఆ రేటింగ్ ఇవ్వడం విశేషం.తుంబాడ్ చిత్రాన్ని రూపొందించడానికి నిర్మాతలు 6 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ సినిమా షూటింగ్ 2012లో మొదలు కాగా 2018లో విడుదలైంది.

 ఈసారి ఆ సస్పెన్స్‌‌ను మిస్ కాకండి

ఓ గుహ.. వైవిధ్యమైన నేపథ్యం.. చూడగానే భయంగొలిపే యాంబియన్స్.. దాని వెనక ఓ జానపద గాథ. గుహలోకి వెళితే తిరిగి రారు అన్న పుకార్లు. ఎవరో ఒకరు వెళ్లి.. ధైర్యంగా అందులోని నిధితో బయటకు రావడం.. అటుపై జరిగే పరిణామాలు.. ఇవన్నీ తుంబాడ్‌లో కనిపిస్తాయి. దీంతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. 2018లో ఏ స్టార్ కాస్ట్ లేకుండా విడుదలైన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయ్యామని ఫీలయ్యే వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్లందరూ సెప్టెంబర్ 13న రెడీగా ఉండండి. ఎంతోమందికి మోస్ట్ ఫేవరెట్ అయిన తుంబాడ్‌ను రీరిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా గట్టిగా సౌండ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ను అందిస్తాయి.

Share post:

లేటెస్ట్